రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి
ప్రజల ఆదరణ ఆప్యాయత అనురాగాలు ఎన్నటికీ మరువలేనివని డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు, డోర్నకల్ నియోజకవర్గం లోని చిన్న గూడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాలుస్తూ. అడుగడుగునా రెడ్యా నాయక్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు హోరెత్తించారు,చిన్న గూడూరు మండలంలోని “పల్లె – పల్లెకు మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో భాగంగా,చిన్న గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు మేగ్యా తండా, చిన్న తేజ తండా, లకావత్ తండా, జయ్యారం, మన్నెగూడెం, మంగోలి గూడెం, గ్రామాలలో విస్తృత పర్యటన చేసి స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున సిసి రోడ్లు ప్రారంభం చేస్తూ పలువురు సమస్యలు తెలపగా అధికారులకు ఆదేశాలిస్తూ, హామీలు ఇస్తూ అదుగడుగున ప్రజలు మహిళలు బ్రహ్మరథం పట్టారు.ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు ప్రజలు పెద్ద ఎత్తున హారతులు అందజేస్తూ పువ్వులు జల్లుతూ నినాదాల తో స్వగతం పలికారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చెయ్యదు అనుకోనీ కలలుగన్నారన్నారు, కానీ మన ముఖ్యమంత్రి దానికి దీటుగా రాష్ట్రం మొత్తం 37000 వేల కోట్ల తో రుణ మాఫీ చేయడం జరిగింది అన్నారు, జయ్యారం నుండి చిన్న గూడూరు వరకు నాలుగు కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, ఈ గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా బిటి రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అన్నారు, మన్నెగూడెం నుండి ఉళ్లేపల్లి గ్రామపంచాయతీ వరకు 15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం మరియు బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, దేశం లో ఒక్క తెలంగాణ రాష్ట్రo లో తప్ప 24 గంటల ఉచిత విద్యుత్, ఏ రాష్ట్రం లో కూడా ఇవ్వడం లేదని తెలిపారు, కాళేశ్వరo ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలేశ్వరం ఎందుకు గుర్తుకు రాలేదు అన్నారు ఆసరా పెన్షన్లు రైతుబంధు,రైతు బీమా, కల్యాణ లక్ష్మి,దళిత బందు లాంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప మిగతా ఏ రాష్ట్రాలలో లేవు అన్నారు,ప్రజలు చూపిస్తున్న ఆధార అభిమానాలు ఎన్నటికీ మరువలేవని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికి హాని చేయకుండా ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం జరుగుతుందని తెలియజేశారు. నమ్మకంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ కేటీఆర్ పార్టీ వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వేగంగా ముందుకు వెళుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఎన్నటికీ మరువలేనివని వారి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని వారన్నారు, వచ్చేది రాబోవు రోజులలో ఎలక్షన్లు వస్తున్నాయి కొత్త బిచ్చగాడు లెక్క వాళ్లు వీళ్లు వచ్చి పోతుంటారు ఎవరి మాట వినకండి మోసపోతె, గోసపడతాము వీళ్ళు ఎన్ని ఏళ్ళు చేసిన పనులు మనకు గుర్తున్నాయి, కేసీఆర్ వచ్చినాక చేసిన పనులు గుర్తున్నాయి ప్రజలు ఆలోచించాలి మోసపోతే గోస పడతామున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న గూడూరు ఎంపీపీ వల్లూరి పద్మ వెంకటరెడ్డి, జెడ్పిటిసి మూల సునీత మురళీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామ్ సింగ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మంగపతి రావు, మండల మహిళా అధ్యక్షురాలు నిరూప, జయ్యారం సర్పంచి చెవుల రాధా ముత్తయ్య, మంగోలి గూడెం సర్పంచ్ నవీన్ కుమార్, నాయకులు , పలువురు సర్పంచులు తో పాటు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు