
local news ne69news telugu galam local news satation ghanpur news mp elections news
స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న తెలుగు గళం స్టేషన్ ఘనపూర్ మార్చి06 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ అర్ డి ఓ డిఎస్ వెంకన్న నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న సూపర్ వైజర్లతో ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ అవగాహన సమావేశంలో పలు విషయాలపైన అవగాహన పరిచారు.(1)ఓటరు జాబితా నందు మొదటి పేజీ లో పోలింగ్ కేంద్రం నంబర్ పోలింగ్ కేంద్రం పేరు మరియు లొకేషన్ ఇతరత్రా వివరములు సరిగ్గా ఉన్నాయా అనేది పరిశీలన చేసుకోవాలి.(2)గ్రామం నుండి శాస్వతంగా వెళ్లి పోయిన,డబుల్ మరియు మరణించిన ఓటర్ల జాబితాలు తయారు చేయాలి.(3) ఫారం 6,7,8 కొత్త ఓటర్ల నమోదు,సవరణలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.(4)పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు వివరములు తీసుకోవాలని మరియు రాబోవు పార్లమెంట్ ఎలక్షన్ ల నందు అందరూ విధులను సక్రమంగా నిర్వహించాలని తగు సూచనలు జారీ చేసినారు.