రామాలయం లో మహాఅన్నదానం
మరిపెడ మండల కేంద్రంలోని రామాలయం లో ఘనంగా మహా అన్నదానం నిర్వహించారు. మచ్చ సోమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఐనా మచ్చ వెంకట నరసయ్య, మచ్చ శ్రీనివాసరావు పద్మావతి దంపతులు, వారి కుమారుడు హర్షవర్ధన్,వైష్ణవి దంపతులు, మచ్చ శంకర్,మచ్చ నాగేశ్వరరావు,రామాలయం లో ఏర్పాటు చేసిన వినాయకు నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లు పాల్గొని 5 వ రోజు మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు,అనంతరం వారు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విగ్నేశ్వరుడు ఆశీస్సులు ఎప్పటికీ ప్రజలకు ఉండాలని అన్నారు.గణేష్ ఉత్సవ సందర్భంగా పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేయడానికి ఈ మహా అన్నదాన కార్యక్రమం చేపట్టమని అన్నారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఎప్పటికీ మాపై చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు నిరంతరం చేపట్టడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటమనీ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పువ్వాడ నర్సయ్య,శ్రీనివాస్,దిలీప్, భక్తులు పాల్గొన్నారు.