రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు
మండల పరిధిలోని కృష్ణవేణి స్కూలు విద్యార్థులు టి. సత్య బ్రూస్లీ, తిరుపతి. అభిరామ్,హెచ్.నవనీత్, నేనావత్ కీర్తి వన్నె శ్రీ,ఎన్. జతిన్ రెడ్డి, ఎస్కే.షాకీర్, టి. సత్య గౌరవ్ లీ, వై. గోకుల్ కృష్ణ, బనావత్ ఉమామహేశ్వరి, బి.భవిష్య రెడ్డి, పి.అస్పియా ఐమాన్, వై. చరణ్ తేజ్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 14 నుంచి 16 వరకు కాకినాడలో జరగనున్న 39వ సబ్- జూనియర్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.అనురాధ రెడ్డి, ఇన్చార్జ్ కే.శశికళ, పిఈటి.వెంకటరమణ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.