రూ.1.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హసన్పర్తి మండల పరిధిలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు,డ్రైనేజ్,పైప్లైన్,ఓపెన్ జిమ్ సెంటర్ నిర్మాణ పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య స్థానిక శాసన సభ్యులు కె.ఆర్.నాగరాజు,నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 66వ డివిజన్ గాంధీ విగ్రహం సమీపంలో సుమారు రూ.1 కోటి 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు & డ్రైనేజ్ నిర్మాణ పనులకు,విజయ గార్డెన్స్ సమీపంలో రూ.14 లక్షల వ్యయంతో పైప్లైన్ పనులకు,హసన్పర్తి పెద్ద చెరువు వద్ద రూ.4.99 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ..నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్,డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్,ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి,హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,ప్రజాప్రతినిధులు,డివిజన్,మండల,గ్రామ స్థాయి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.