
రెడ్యానాయక్ ను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం
డోర్నకల్ నియోజకవర్గమే నా దేవాలయం నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు నేను వారి సేవకున్ని.ఈ నినాదం ఓ విప్లవాన్నే సృష్టించింది లక్షలాది మందిలో నమ్మకాన్ని నింపింది వేలాది మంది వెంట నడిచే సైన్యాన్ని తయారుచేసింది. తనను నమ్మిన వందలాది మంది సామాన్యులను అసమాన్యులుగా మలిచింది సుమారు నలబైసంవత్సరాలుగా ఆ నాయక్.డి.ఎస్.రెడ్యానాయక్ చేతిలోనే నియోజకవర్గ ఆదిపత్యం ఉండేలా చేసింది చూసింది పుట్టుక..చావు సహజమే అయినప్పుడు. ఆ నడుము కొద్దిపాటి జీవితాన్ని గుంపులో గోవిందా. అంటూ బ్రతికేయడం ఎందుకు ఏదో ఒకటి సాదించాలనే తపన ఆ..గిరిజన యువకునిలో మొదటినుండి కనిపించేది నలుగురిలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత ప్రదర్శించడం బాల్యం నుండే రెడ్యానాయక్ కు అలవాటయ్యింది. మారుమూల తండాలో పుట్టి కాలిబాటలు కూడా లేని ఆరోజుల్లో. బ్యాచిలర్ డిగ్రీ చదివి పట్టభద్రుడు కాగలిగాడు అంటేనే ఆయన పట్టుదలను అర్దం చేసుకోవచ్చు. ఉద్యోగ అన్వేషణలో ఉండగానే మనసు రాజకీయాల వైపు మళ్ళింది. తాను చదువుకున్న వరంగల్ కళాశాల నేర్పిన అభ్యుదయ ఆలోచనలతో. పదిమందికి సేవచేసేందుకు రాజకీయాలను వేదికగా ఎంచుకున్నారు వీరుడు చేతిలో కట్టెపుల్లయినా మహాఖడ్గమే అవుతుందని సమర్దత ఉంటే కర్రబొంగుతో రాగాలు పలికించవచ్చని నిరూపించాడు రెడ్యానాయక్..!! చిన్నపదవా పెద్దపదవా అని కాకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ప్రజలమద్య ఉండడం. ప్రజలకోసం పనిచేయడమే తన వృత్తిగా ఎంచుకున్నాడు సర్పంచ్ గా సమితిఅద్యక్షునిగా మండలపరిషత్ అద్యక్షునిగా జనరల్ స్థానంలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎదుర్కొని గెలిచిన ఎమ్మెల్యేగా. కాలంతో పాటు పరుగులు పెట్టాడు అప్పుడప్పుడూ గడియారం ముళ్ళే అలసిపోయేంతగా కాలంతో పోటీ పడ్డాడు..!! ఉగ్గంపల్లి తండాలో మధ్యతరగతి గిరిజన కుటుంబంలో పుట్టిన రెడ్యానాయక్ రాష్ట్రస్థాయి నాయకునిగా ఎదిగారు జీవితం ఎప్పుడూ పూలదారి మాత్రమే కాదు రాళ్ళు..రప్పలు ఉంటాయి అదునుచూసి కాటేయాలని ప్రయత్నించే త్రాసులు ఉంటాయి. అన్నారు రెడ్యానాయక్ రాజకీయజీవితంలోను అలాంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోతే. ఎదురుదెబ్బ తగిలినప్పుడు వెనకడుగువేస్తే జీవితగమనానికి అక్కడే. పులిస్టాప్ పడుతుంది. బెదిరిపోతే..బెదిరించేవాడుంటాడు ఎదురుతిరిగితే వెంటనడిచే వాళ్ళు ఉంటారు. అనే విషయాన్ని తన జీవితంలో ఎన్నో సార్లు రుచిచూసిన రెడ్యానాయక్ వెనకడుగు వేయలేదు. తాను బిందువే కావచ్చు. సింహంతో పోటీకి సిద్దపడ్డాడు..! పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటూ అంతకాలం అంతా తామే అనుకున్న పెద్దల నిర్ణయంపై మనోదైర్యంతో తిరుగుబాటు చేసాడు..!! గెలిస్తే కొత్తచరిత్రకు తెరతీస్తా. ఓడిపోతే చరిత్రను మార్చడానికి మరోప్రయత్నం చేస్తా అంటూ ఉక్కసంకల్పంతో అడుగువేసాడు పార్టీ అదిష్టానం ఆశీస్సులు లబించడం. పోటీచేసే అవకాశం రావడంతో నియోజకవర్గ ప్రజలు ఆయన వెంట నడిచారు. రెండవసారి ఎమ్మెల్యేగా రెడ్యానాయక్ విజయం సాదించారు. ప్రజలు తనపై పెంచుకున్న నమ్మకం. పెట్టిన బాద్యత మరింత పట్టుదలను ఆయనలో పెంచాయి. నిరంతరం ప్రజలమద్యనే గడిపాడు రెడ్యా నాయక్ మూడవసారి..! నాలుగవసారి..!! వరుసగా విజయాలు సాదించారు. ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రి మండలిలో కీలకబాద్యతలు పోషించారు. ఐదవసారి అనుహ్యంగా ఓటమిపాలయినా.అంతలోనే తెలుసుకొని మునుపెన్నడూ లేనంతటి స్థాయిలో ప్రజలమద్యకు దూసుకొని పోయారు. తెరాస ప్రభంజనాన్ని తట్టుకొని ఆరవసారి పోటీచేసి ఐదవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మారిన రాజకీయపరిణామాల్లో తెరాసలోకి చేరారు. ఏడవసారి పోటీచేసి ఆరవసారి ఎమ్మెల్యేగా విజయం సాదించి నియోజకవర్గ ప్రజల నాయకునిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగానే టికెట్ హామీ ఇవ్వడంతో ఎనిమిదవసారి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో దిగేందుకు రెడ్యానాయక్ సిద్దంగా ఉన్నారు. ఆరుపదుల వయస్సు దాటినా ఆయనలో అలసట కనిపించదు రాజదానిలో ఉంటూ రాజకీయాలు చేయగల అపూర్వ అనుభవం ఉన్నా.రెడ్యానాయక్ స్థిరనివాసం ఉగ్గంపల్లితండా మాత్రమే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఆయన మదిలో మెదిలే ఆలోచన ఒకటే డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ఒక్కమాటలో చెప్పాలంటే డోర్నకల్ నియోజకవర్గమే రెడ్యానాయక్ బలం నియోజకవర్గ ప్రజలే ఆయన బలగం. ఎంతమంది పోటీ చేసిన డోర్నకల్ లో జనకని రెడ్యానాయక్ గెలుపు నాదే అంటూ ముందుకు సింహంలా వెళ్తాడు అతనిపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన నేను చేయని ఒకే ఒక్కటి నేను తప్పు చేయను నా వాళ్ళతో తప్పు చేయించను అనే సిద్ధాంతంతో ముందుకు కొనసాగుతాడు రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్న ఎన్నిసార్లు ఎలా గెలుస్తున్నావని పలుమార్లు ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డ వారికి చెప్పేది నా ప్రజల మధ్యలో నేను ఉంటా ఎంత రాత్రి అయినా నా డోర్నకల్ కి వెళ్తాను అక్కడే నిద్రపోతాను నేను లేవటం ముందే నా ప్రజలు కష్టాలు పాలుపంచుకుంటాను అందువలన నేను ఇన్నిసార్ల ఎమ్మెల్యేగా అయ్యాను అన్నారు. సోమవారం 115 పేర్లు ఎమ్మెల్యేల అభ్యర్థులు పేర్లు ఖరారు చేయడంతో డోర్నకల్ నియోజకవర్గం నుండి మళ్లీ రెడ్యా నాయక్ కు అభ్యర్థి పేరు ఖరారు చేయడంతో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు గుడిపూడి నవీన్ రావు మాట్లాడుతూ డోర్నకల్ రెడ్యానాయకులు టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషం అని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు డోర్నకల్ నుండి భారీ మెజార్టీతో రెడ్యానాయకులు మళ్లీ అసెంబ్లీకి పంపిస్తామని వారు అన్నారు ఈసారి మంత్రి పదవి తీసుకొని రావాలనే ఉద్దేశంతో మా నాయకుడు ప్రజల మధ్య ఉండే నాయకుడని అన్నారు డోర్నకల్ కి ఎంతమంది బిచ్చగాళ్ళు వచ్చిన వచ్చి పోయే వాళ్లే ఎప్పటిలాగా మా నాయకుడి అభివృద్ధిని చూసి వెళ్లిపోయే వాళ్లే ఎన్ని శక్తులు అడ్డొచ్చినా రెడ్యా నాయక్ ఏమి చేయలేరు అన్నారు. ఎనిమిదవ సారి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు మరిపెడ మండలంలో టపాసులు కాల్చితూ స్వీట్లు పంచుతూ సందడి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సింధూర కుమారి ఎంపీపీ అరుణ రాంబాబు జడ్పిటిసి శారద రవీందర్ మరిపెడ మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణ రెడ్డి
మాజీ ఓ డి సి స ఎం ఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులు
సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.