

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎరువుల సరఫరా,పంపిణీ వ్యవస్థను సమీక్షించే భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం రేగొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి చెందిన ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్టాక్ రిజిస్టర్,స్టాక్ బోర్డు,ఎరువుల నిల్వలు,కొనుగోలు రసీదుల పుస్తకాలను పరిశీలించి ఎరువుల సరఫరా మరియు పంపిణీపై అధికారులను ప్రశ్నించారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని సూచించారు.పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులకు ఎరువులు అందించడంతో పాటు పాసుపుస్తకాలు లేని రైతులకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఎరువులు తీసుకునే అవకాశాన్ని కల్పించామన్నారు.జిల్లాలో ఎరువుల సరఫరా సజావుగా కొనసాగుతుందని, ఎలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.రైతులు తమ అవసరాల మేరకు ఎరువులు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.ఎరువుల సరఫరాలో పారదర్శకతను పాటించాలని,దుకాణాల వద్ద స్టాక్ బోర్డులను ప్రతి రోజూ అప్డేట్ చేయాలని, అక్రమాలను సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రేగొండ తహసీల్దార్ శ్వేతా,పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.