
కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు గళం న్యూస్ రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గంగుల రమణారెడ్డి సర్పంచ్ మరియు బండి సాంబయ్య వార్డు మెంబర్, రాస సమ్మయ్య బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ,అలాగే రేగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు వడ్లకొండ రమేష్ శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి అహ్వానిచడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో చేసే అభివృద్ధి చూసి ఇంకా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని అన్నారు. భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి పరంగా రాష్ర్టంలో ముందు వరుసలో నిలుపతమని ఎమ్మెల్యే గండ్ర అన్నారు.ఈనాటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రేగొండ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య,పోచంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కట్ల నరసింహ రెడ్డి, పోచంపల్లి గ్రామ కమిటీ బృందం ఉన్నారు.