రైతుల సౌలభ్యం కోసమే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్
ఈ నెల 20 నుండి యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
మరిపెడ మండల వ్యవసాయ శాఖ అధికారి వీరసింగ్ ప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా కొనుగోలు చేయుటకు వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అమలులోకి తీసుకువచ్చింది అని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వ్యవసాయ విస్తరణ అధికారి వీరసింగ్ తెలిపారు,గత వాన కాలంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ ను అమలులోకి తీసుకురావడం జరిగింది .రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంటను బట్టి వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ అయినా ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవడం జరుగుతుంది .ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు .ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుంది మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది .ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వాళ్ళు మరియు కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కౌ లు దారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే కౌలుకు తీసుకున్నారు వారి యొక్క పట్టాదారు పాస్ బుక్ నెంబరు ద్వారా బుక్ చేసుకోవచ్చు .అయితే ఆ పట్టాదారు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది .ఈ యొక్క యాప్ ను రైతులకు అలవాటు చేయటానికి మరియు అవగాహన కల్పించడానికి ప్రతి ఔట్లెట్ దగ్గర వ్యవసాయ శాఖ ద్వారా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది లేదా సంబంధిత ఏఈ ఓ రైతులకు సహాయం చేయడం జరుగుతుంది .కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క యాప్ను వినియోగించుకొని యూరియాను కొనుగోలు చేయవచ్చు. భూమి విస్తీర్ణాన్ని అనుసరించి ప్రతి 15 రోజుల వ్యవధిలో విడతల వారీగా యూరియా బుకింగ్ చేసుకునే విధానం అమల్లో ఉంటుందన్నారు దీనివలన యూరియా సరఫరాలలో అంతరాయం లేకుండా ఉండడంతో పాటు అక్రమ నిల్వలు మరియు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నారు, దయచేసి రైతులు ఈ యొక్క సదుపాయాన్ని బుకింగ్ యాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు