రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం మోతే మండల పరిషత్ కార్యాలయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ……. మోతె మండలంలో ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయకట్టులో ఏ గ్రామాలకు నీరు అందడం లేదు పరిశీలించి నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని చూసించారు. అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు లబ్దారులకు పంపిణీ చేశారు. అనంతరం మామిళ్లగూడెం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సమావేశంలో ఎస్సారెస్పీ రమేష్, ఏ ఈ లింగయ్య, ఎమ్మార్వో యాదగిరి, ఎంపీడీవో చారి,టిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.