
రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడికి ఆర్థిక సాయం అందజేత
మునగాల మండల పరిధిలోగల బరఖత్ గూడెం గ్రామానికి చెందిన ములుగూరి వెంకటేశ్వర్లు గత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలయి దీనస్థితిలో ఉన్నాడని తెలుసుకుని తనతో 2000 – 2001 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న స్నేహితులు 30 వేల రూపాయలు సమకూర్చి వారి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితుడు ఇలాంటి దుస్థితిలో ఉండటాన్ని చూసి కన్నీరు పరిమితం అయ్యారు, అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఇంకా మును ముందు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు షేక్ జానీ బాబా, సిరికొండ నాగేశ్వరరావు, చిర్రా గోపరాజు, అనంతల శ్రీను, వల్లోజు ఉపేందర్, వీరబోయిన సింహాద్రి, పాల బిందెల ఆదినారాయణ, షేక్ మహబూబ్ అలీ, ఎస్.కె మూభీన్, లంజపల్లి అనిల్, జిల్లా నరేష్, గుడిపాటి కనకయ్య, గుడిపాటి రాంబాబు, శ్రీకాంత్, రాఘవేంద్రరావు, దుర్గయ్య, వి నరేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.