

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ వాస్తవ్యుడు రాపోలు శ్రీనివాస్ ఈనెల 13న బట్టుపల్లి మూడు చింతల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.వారి భార్య తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న 1995 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ అందరూ కలుసుకుని వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కింద వారి కుమార్తెలకు 51,000 ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు.అదే విధంగా బాల్య మిత్రులందరికీ చేదోడువాదోడు ఉండాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామంలో ఉన్న నాయకులు సంతోషం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ తూటి సమ్మిరెడ్డి సాంబరాజు యాదవ్ నాగరాజు బాల్య మిత్రులందరూ పాల్గొన్నారు.