రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
ప్రయాణికులకు, వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహన కల్పిస్తున్న మరిపెడ పోలీసులు మరిపెడ మండలంలో వాహన తనిఖీ లో భాగంగా డీఏస్పీ తొర్రూర్ వాహనాలకు నంబర్ ప్లేట్ లేని వాహనాలు,హెల్మెట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాహన చోదకులు రోడ్ భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని వారితో రోడ్డు భద్రత ప్రమాణాలు పాటిస్తామని ప్రమాణం చేయించారు.
ఇట్టి కార్యక్రమంలో సీఐ మరిపెడ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరభద్ర రావు, ఎస్సై టి కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .