లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు
హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మొత్తం 11 మందికి రూ.6లక్షల 25 వేల విలువైన చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమమేనని పేర్కొన్నారు.ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి నిజమైన వరమని తెలిపారు.వేలాది పేద-మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తోందని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.తాను వ్యక్తిగతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సీఎం సహాయం అందేలా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.ఎంపీ కృషితో సీఎం సహాయనిధి పొందినందుకు లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు డాక్టర్ కడియం కావ్యకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు పాల్గొన్నారు.