లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జఫర్గడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని స్టేషన్ ఘన్పూర్ లయన్స్ క్లబ్ ఎం.జె.ఎఫ్.మధుసూదన్ మనవడు అచంత్య అచంత్య పుట్టినరోజు సందర్భంగా,అలాగే లయన్స్ క్లబ్ ట్రెజరర్ కోతి అశోక్ కుమార్తె తేజస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు.జఫర్గడ్ సర్పంచ్ కుల మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జఫర్గడ్ అధ్యక్షుడు పూర్ణచందర్ మాట్లాడుతూ..గ్రామ ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధాన లక్ష్యమని తెలిపారు.కంటి పరీక్షలు,డయాబెటిక్ పరీక్షలు,జనరల్ చెకప్ నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.కంటి చూపు పరీక్షలను హనుమకొండ శరత్ హాస్పిటల్ వైద్యులు నిర్వహించగా,డయాబెటిస్ పరీక్షలను డాక్టర్ కరుణాకర్ రెడ్డి(లయన్స్ క్లబ్ గైడింగ్ లైన్)నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జఫర్గడ్ కార్యదర్శి యుగంధర్‌తో పాటు సభ్యులు శ్రావణ్ కుమార్,శివప్రసాద్,వెంకటేశ్వర్లు,రోడ్డ రాజు,మాద శ్రీధర్,గురురాజు,సోమేశ్వర్,వినయ్,రాజు,సంతోష్ తదితరులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.