
లిక్కర్ దందాను ప్రభుత్వము నడపడాన్ని ఓ పెద్ద తప్పిదంగా భావించి, ఈ దందా నుంచి తప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కోరుతున్నది. నిజానికి లిక్కర్ దందాను చేసేవారు నాయకులుగా, రాజకీయ నాయకులుగా అనర్హులుగా ప్రకటించాల్సిన ప్రభుత్వమే, మరిచిపోయి ప్రవర్తించడం అనేది, అత్యంత బాధాకర విషయం గానే పరిగణించాలి. సమాజాన్ని చైతన్య పరిచి, మానవత్వం మానవ విలువలు, మానవ సంబంధాలవైపు తీసుకపోయి, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా చేయాల్సిన ప్రభుత్వము, కంచె చేను మేసిన విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత విచారకరమైన విషయమేకాక, దుర్మార్గమైన చర్యగా భావించాలి. ప్రస్తుతం ఎటు చూసినా అడ్డు అదుపు, లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వము ప్రతి గ్రామములో చిన్నాచితక వ్యాపారులను ఆశకు గురిచేసి, పల్లె ప్రాంతాలలో బెల్ట్ షాపులను ప్రోత్సహించడం అనేది క్షమించరాని నేరంగానే భావించాలి. కావున ఇకనుంచి అయినా ప్రభుత్వ పెద్దలు, ప్రజల క్షేమం, సంక్షేమం శ్రేయస్సును ఆశించి, తమ పనిని సక్రమంగా నిర్వర్తించగలరని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ భావిస్తున్నది. లేని పక్షంలో ప్రజలను చైతన్య పరచి, మత్తు సంకెళ్ల నుంచి ప్రజలను రక్షించి, ప్రజలకు న్యాయం జరిగేంతవరకు నిద్రపోదని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ హెచ్చరిస్తున్నది.