వందేమాతరం 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య
హనుమకొండలోని పింగళి మహిళ డిగ్రీ కళాశాలలో భారత సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన వందేమాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ఎంపీ డా.కడియం కావ్యకు ఘన స్వాగతం పలికారు.ముందుగా సీబీసీ ఏర్పాటు చేసిన వందేమాతరం గీతం,భారత రాజ్యాంగ చరిత్రను వివరిస్తున్న ఫోటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ ప్రారంభించి సందర్శించారు.రాజ్యాంగం వల్లే విద్య హక్కు
ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ..“ఈ రోజు ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు లభించిందంటే అది భారత రాజ్యాంగం వల్లే సాధ్యమైంది.ఈ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమోఘం”అని అన్నారు.చదువు పేదరిక నిర్మూలనకు ప్రధాన ఆయుధమని,సమాన హక్కులు కల్పించే శక్తి విద్యకే ఉందని స్పష్టం చేశారు.వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీక
వందేమాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తిని రగిలించిన మహత్తర ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.దేశ స్వాతంత్ర్య సాధన కోసం అనేక మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.యువత దేశ చరిత్రను తెలుసుకొని,దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.విద్యార్థినులకు స్ఫూర్తిదాయక సందేశం
భారతదేశం సర్వమత సమ్మేళనమని,సంస్కృతి-సాంప్రదాయాలకు నిలయమని తెలిపారు.సరోజిని నాయుడు,దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహిళా నాయకుల సేవలను స్మరించుకుంటూ,ప్రతి విద్యార్థిని రాణి రుద్రమదేవి,ఝాన్సీ లక్ష్మీబాయిలను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.మహిళలు విద్యతో పాటు సామాజిక,రాజకీయ రంగాల్లో మరింత ముందుకు రావాలని అన్నారు.ఫ్యూచర్ ఇండియా విద్యార్థులే
ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ భారతదేశమని పేర్కొన్న ఎంపీ,రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.సోషల్ మీడియ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని,తమ భవిష్యత్ తమ చేతుల్లోనే ఉందని,చదువుపైన పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు.చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు,సామాజిక సేవల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు,కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి,అధ్యాపకులు,సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.