
పిడుగుపాటుతో యువకుడు మృతి
ఈ69న్యూస్ వరంగల్:జిల్లాలో సోమవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు,మెరుపులతో కుండపోత వర్షం కురిసింది.ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడగా,చెట్లు కూలి రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది.అయితే ఈ వర్షం విషాదాన్ని మిగిల్చింది.దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన రాకేశ్ (25)పై వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.చురుకైన,ఉత్సాహవంతుడైన రాకేశ్ అకాల మరణం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండగా,గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.వాతావరణ నిపుణులు వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.