
warangal traffic news

ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డుపై గుంతలు గుంతలు ఉండటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఈ పరిస్థితిని గమనించిన హోంగార్డు అమీన్ మరియు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తారా చంద్ తమ డ్యూటీకి మించి మానవత్వాన్ని ప్రదర్శిస్తూ స్వయంగా మొరం తెప్పించి గుంతలను మూసివేశారు. వీరి కృషిని చూసిన వాహనదారులు వారిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు ప్రజాసేవకు నడుపుతున్న అధికారుల పట్ల మరింత గౌరవాన్ని కలిగిస్తాయి.