
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్-ఖమ్మం హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.నాయుడు పెట్రోల్ పంపు పక్కనే ఉన్న మల్లన్న వైన్స్ లోకి ఓ కారు దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో వైన్స్ ముందు పబ్లిక్ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి వైన్స్ లోకి వెళ్ళిన కారు.ఘటనలో వైన్స్ లైటింగ్ ఫ్లెక్సీ బోర్డు,ఆటో డ్యామేజ్ అయింది.వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వెడల్పు లేకపోవడం,మద్యలో డివైడర్ పెట్టడంతో రోడ్డు వెడల్పు తగ్గి నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాల నివారణ చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.