
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ పట్టణం కేంద్రంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ పట్టణ శాఖ అధ్యక్షులు ముహమ్మద్ సలీం అధ్యక్షతన మసీహ్ మౌఊద్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పవిత్ర ఖుర్ఆన్ పఠనం ముబారక్ అహ్మద్ చేసి తెలుగు అర్థం వినిపించారు.అనంతరం నజం ఉర్దూ పద్యం అమ్జద్ పాషా చదివి వినిపించారు.అనంతరం మౌల్వీ ముహమ్మద్ ఇక్బాల్,మౌల్వీ ముహమ్మద్ పాషా అయాన్,ముహమ్మద్ రఫీ మసీహ్ మౌఊద్ దినోత్సవం విశిష్టత,ప్రత్యేకత,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆవిర్భావం గురించి వివరంగా ఉపన్యసించారు.ఈ కలియుగ కాలంలో ధర్మ సంస్కరణ కొరకు నిజమైన ధర్మాన్ని బోధించడానికి సర్వ ధర్మాలను ఏకం చేయడానికి అవతార పురుషునిగా దైవ ఆజ్ఞానుసారం హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం అవతరించారన్నారు.23 మార్చి1889 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీనీ హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ స్థాపించారన్నారు.నేడు 200కు పైగా దేశాల్లో ఐదవ ఉత్తరాదికారి హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ సారధ్యంలో అందరితో ప్రేమ ద్వేషం ఎవ్వరితో లేదు అనే నినాదంతో ప్రపంచ శాంతి కోసం,సర్వ ధర్మాలను ఐక్యమత్యం చేయడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కబీర్,రియాజ్,రఫీ,కరీం,సలాం,మహమూద్,హంజ తదితరులు పాల్గొన్నారు.
