
త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను వరంగల్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఈద్గా,మస్జిద్ లలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్ లు) చేశారు.ఇమాంలు మౌల్వీలు బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.హజ్రత్ ఇబ్రాహీం,హాజిర,ఇస్మాయీల్ ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కాసేపు ఆనందంగా గడిపారు.వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. రంగశాయపేటలో అహ్మదీయ ముస్లిం జమాఅత్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.అహ్మదీయ మౌల్వీ ముహమ్మద్ పాష అయాన్ ప్రత్యేక ప్రార్ధనలు చేయించి ప్రసంగించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఇబ్రాహీం ప్రవక్త భక్తిని పరీక్షించడానికి అల్లాహ్ పెట్టిన పరీక్షకు తన కుమారుడు ఇస్మాయీల్ ను అల్లాహ్ కోసం బలి ఇవ్వడానికి సిద్దపడ్డారని అన్నారు.నేటి యువత కూడా తమ తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించి కోరికలను తీర్చాలని అన్నారు.అనంతరం అహ్మదీయ ముస్లిం జమాఅత్ 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గత సంవత్సరం బక్రీద్ పండుగ సందర్బంగా ఇచ్చిన ఖుద్బా ప్రసంగం ను చదివి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సదర్ సలీం,యూత్ అధ్యక్షులు కబీర్ పాష,వక్ఫే జదీద్ చందా ఇన్స్పెక్టర్ ఇక్బాల్,హుస్సేన్,కరీం,అమ్జద్,యూసుఫ్,రఫీ,ఇస్మాయీల్,ముబారక్ మరియు స్త్రీలు,పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.