
వరంగల్ లో డ్రంకన్ అండ్ డ్రైవ్ పై పోలీసుల కఠిన చర్యలు
ఈ69న్యూస్ వరంగల్/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం
ఏప్రిల్ 9న వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడ్డాయి.పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఐపిఎస్ మరియు ఎసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో 19 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా,ఒకరికి రెండు రోజుల సామాజిక సేవ శిక్ష,మిగతా 18 మందికి కలిపి రూ.23,800 జరిమానా విధించారు.అంతేకాకుండా,డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 7 మందికి రూ.3,500 జరిమానా విధించారు.ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు తావులేదని,భవిష్యత్తులో మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు.