
ఈ69న్యూస్ న్యూ డిల్లీ
వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పార్లమెంట్ లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గళం ఎత్తారు.ఎంతో గొప్ప చారిత్రక వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉన్న వేయి స్తంభాల గుడి,వరంగల్ కోట,కాకతీయ కళాతోరణం వంటి పర్యాటక ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేయాలన్నారు.వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల వరంగల్ ప్రాంతవాసులకు ఉపాధి మరియు ఆదాయం లభిస్తుందన్నారు.సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో వరంగల్ నగరం పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పర్యాటక రంగానికి సమగ్ర అభివృద్ధికి చర్యలు ప్రారంభించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని అభ్యర్థించారు.