ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్క్రీన్ వర్కర్లు కామారెడ్డి మున్సిపల్ ఆఫీసు నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా కందారపు రాజనర్సు సిఐటియు టౌన్ కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగింది చంద్రశేఖర్ సిఐటి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ
నేపథ్యంలో పేదల కోసంస్కీంలు అమలు
జరగాలంటే,స్కీం వర్కర్ల సమస్యలు
పరిష్కరించాలంటే పోరాటం తప్ప మరో
మార్గంలేదు.స్కీంల రక్షణ కోసం,స్కీం వర్కర్ల
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలలో
రాష్ట్రంలోని స్కీం వర్కర్లందరూ ఐక్యంగా పెద్ద
సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని
జయప్రదం చేసినారు.*
అచ్చేదిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల కాలంలో స్కీంలను,స్కీం వర్కర్ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది.నిరసిస్తూ,స్కీంల రక్షణ,స్కీం వర్కర్ల హక్కుల సాధన కోసం దీనిని జనవరి 6న స్కీం వర్కర్లందరూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని స్కీం వర్కర్ల జాతీయ సదస్సు నిర్ణయం చేసింది.
అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజనం,ఎన్హెచ్ఎం,గ్రామీణ ఉపాధి హామీ,ఐకెపి పశుమిత్ర మిషన్ భగీరథ విఓఏలు,సర్వశిక్షా అభియాన్ తదితర 72 స్కీంలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఇందులో దేశంలో ఒక కోటి మంది,మన రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు గత 40సంవత్సరాలకు పైగా పని చేస్తున్నారు.వీరిలో అత్యధికులు మహిళలు,బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేరవేయడంలో స్కీం వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.కరోనా సమయంలో ప్రజలకు సేవలందించి,కరోనాను కట్టడి చేయడంలో స్కీం వర్కర్లు ముఖ్యపాత్ర పోషించారు.
అయినా వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి.ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు,మరోవైపు చాలీచాలని వేతనాలతో స్కీం వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మోయలేని పనిభారంతో కునారిల్లుతున్నారు.
ఆశా,మధ్యాహ్నభోజనం తదితర స్కీం వర్కర్లకు నేటికి ప్రసూతి సెలవులు కూడా లేవంటే స్కీం వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వాలు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.కేంద్రం వీరిని కేవలం వాలంటీర్లుగా భావిస్తూ గౌరవ వేతనం,ప్రోత్సాహకాల పేరుతో స్కీం వర్కర్ల శ్రమను దోచుకుంటున్నది.
దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు.ఈ పోరాటాల ఫలితంగా 2013 మే నెలలో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని,కనీస వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,స్కీంల ప్రయివేటీకరణ ఆపాలని తీర్మానం చేసింది.ఈ నిర్ణయం జరిగి 8సంవత్సరాలు దాటింది.అయినా కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడంలేదు.దీనివల్ల ప్రజలు,స్కీం వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
పైగా స్కీం వర్కర్లు ఎలాంటి చట్టాల పరిధిలోకి రారని నిసిగ్గుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు వ్యతిరేకిస్తున్నారు.45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం స్కీం వర్కర్లను చట్టబద్ద సౌకర్యాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
నయా ఉదారవాద విధానాల ప్రారంభంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు కనీస హక్కులు కల్పించే బాధ్యత నుంచి వైదొలగి,ఖర్చుల తగ్గింపు పేరుతో పొదుపు చర్యలను ప్రవేశ పెడుతున్నాయి.నిరంతర పోరాటాలు,అనేక ప్రజా ఉద్యమాల కారణంగా ప్రభుత్వాలు శాశ్వత వ్యవస్థలు,శాఖల స్ధానంలో కనీసం కొన్ని ‘సంక్షేమ పథకాలను’ ప్రవేశ పెట్టవలసి వచ్చింది.
ముఖ్యంగా ఆహారం,ఆరోగ్యం,విద్య మొదలైన ప్రాధమిక హక్కులను నిర్ధారించడానికి చట్టాలను ప్రవేశ పెట్టవలసి వచ్చింది.ఈ నేపథ్యంలో వచ్చినవే అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజనం,ఎన్హెచ్ఎం తదితర స్కీంలు.
సుప్రీంకోర్టు,కాగ్ నివేదిక,యూనిసెఫ్ లాంటి జాతీయ,అంతర్జాతీయ సంస్థలు ఈ స్కీంల సేవలు బాగున్నాయని,స్కీంలను ఇంకా బలోపేతం చేయాలని సూచించాయి.45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అయితే స్కీమ్‌లను ప్రయివేటీకరణ చేయకూడదని తీర్మానమే చేసింది.
కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదు.పైగా స్కీంలను నిర్వీర్యం చేసే అనేక ప్రయత్నాలు ఈ కాలంలో చేసింది.స్కీంల పరిరక్షణ కోసం ఆలోచించే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది.
దీని స్థానంలో స్కీంలను నిర్వీర్యం చేయడానికి నిటి అయోగ్‌ను ప్రవేశ పెట్టింది.స్కీంలకు ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదు సరికదా 60శాతానికి తగ్గించింది.స్కీంలను ఎప్పుడైనా నిలుపుదల చేసే విధంగా అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది.
స్కీంలలో ప్రత్యక్ష నగదు బదిలీ,స్కీం సేవలకు ఆధార్‌ను లింక్ చేయడం,ఎన్ఇపి 2020 కింద 3-6 సంవత్సరాల పాఠశాల పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం,కార్పొరేట్లు నడిపే కేంద్రీకృత వంటగదులను ప్రవేశపెట్టడం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటీకరించడం,జాతీయ డిజిటల్ మిషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రయివేటీకరించటం మొదలైన విధానాలన్నీ స్కీంలను నీరు గార్చడానికి కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలే.
మన దేశానికి స్వాతంత్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కాలాన్ని అమృత కాలంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా అమృతోత్సవాలు జరపాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయం చేసింది.కానీ రెండోవైపు మన దేశాన్ని పోషకాహార లోపం,నిరక్షరాస్యత నుంచి విముక్తి చేయాలనే లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చలేక పోయింది.
దీనికి భిన్నంగా ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాయి.ఈ విధానాల ఫలితంగా దేశంలో 50శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడు తున్నారు.79శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ శిశు అభివృద్ధి కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో జన్మించిన 2.5కోట్ల మంది పిల్లలలో కేవలం 1.75కోట్లమంది మాత్రమే తమ మొదటి పుట్టిన రోజును చూడ గలుగుతున్నారు.అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న 75లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల ధనిక,పేదల మధ్య అంతరం నిరంతరం పెరుగుతున్నది.ప్రపంచంలో ప్రసవ సమయంలోను ఆ తర్వాత సంభవిస్తున్న మాతా శిశు మరణాలలో 50శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి.
ప్రపంచంలో ఆకలితో అలమటించే దేశాలలో మన దేశం గత సంవత్సరం కంటే ఆరు పాయింట్లు పడిపోయి మొత్తం 121దేశాల్లో 107వ స్ధానానికి చేరుకుంది. ఆకలి,పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో తమ పని తీరును కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం మెరుగు పర్చుకోలేదు.ఈ అంశాలన్నీ దేశంలో స్కీంల ప్రాధాన్యత మరింత అవసరమని తెలియ జేస్తున్నాయి.
పై అంశాలతో పాటు బిజెపి ప్రభుత్వం స్కీంలలో మతాన్ని ముందుకు తీసుకు వచ్చి మూఢ నమ్మకాలను పెంచే ప్రయత్నం చేస్తున్నది.ఉత్తరప్రదేశ్ తదితర బిజెపి పాలిత రాష్ట్రాలలో పిల్లలకు తల్లులకు కోడిగుడ్డు పెట్ట కూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం చేస్తున్నాయి.
స్వయంగా ప్రధాన మంత్రిగారే మన్‌కీ బాత్ కార్యక్రమంలో దేశంలో పోషకాహార లోపం తగ్గాలంటే భజన చేయాలని చెప్పారు.పోషకాహార లోపాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలే పెంచే ప్రయత్నం చేస్తే ఈ దేశ భవిష్యత్ ఎమవుతుందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కీం వర్కర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది.స్కీంల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు.పైగా ప్రయివేటీకరణ విధానాలను ఐసిడిఎస్,మధ్యాహ్న భోజనం,మెడికల్ Ê హెల్త్‌లో అమలు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది.
అనేక రంగాలలో విపరీతంగా పని భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నది.కానీ పెంచిన పనికి అనుగుణంగా వేతనాలు పెంచడం లేదు. స్కీం వర్కర్ల సమస్యలు పరిశీలించి,పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.పైగా పోరాటాల పైన ఉక్కుపాదం మోపి అణిచివేయాలని చూస్తున్నది.
ఈ నేపథ్యంలో పేదల కోసం స్కీంలు అమలు జరగాలంటే,స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు.స్కీంల రక్షణ కోసం,స్కీం వర్కర్ల హక్కుల సాధన కోసం 2023 జనవరి 6న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలలో రాష్ట్రంలోని స్కీం వర్కర్లందరూ ఐక్యంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో md మహిబుబ్. వీరయ్య. మున్సిపల్…
సత్యం.. బీడీ యూనియన్
అంగన్వాడి…
బాబాయ్ యాదమ్మ కల్పన సునంద సంతోషిని లక్ష్మీ సిహెచ్ ప్రభ
ఆశా వర్కర్ …మంజుల సుధారాణి భాగ్యరేఖ లలిత అనితపశుమిత్ర …..శ్రీలత చంద్రకళ రజితమిషన్ భగీరథ …..నరసింహులు సాయిలు