
telugu galam news e69news local news daily news today news
గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు ప్రమాదానికి గురై ప్రమాదం ఉంది
ఉపాధ్యాయులు తగిన జాగ్రతలు తీసుకోవాలి
వాతావరణం మార్పు, ఉదయం పూట పొగ మంచు ప్రభావం వలన
దట్టంగా పొగ మంచు ఏర్పడడంతో ఆశ్రమ పాఠశాల గురుకులలో పరిసరాలు కనపడక, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరించే అవకాశం ఉన్నందున ఆశ్రమం పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున, వారు బయటికి రాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.
సోమవారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ సాధ్యమైనంత తొందరగా అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు గిరిజన దర్బార్లో భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, మోటారు, బోరు ఇప్పించుట కొరకు, మారుమూల గిరిజన గ్రామాలలో త్రీఫేస్ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయుట కొరకు, జిసిసిలో డీలర్ పోస్టు ఇప్పించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి సబ్సిడీపై రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసుకొని మత్స్యకారుల సొసైటీ ఏర్పాటు కొరకు, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో స్వయం ఉపాధి ద్వారా జీవనాధారం పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, మరియు దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వెసులు బాటు కల్పించుట కొరకు, అలాగే పోడు భూములకు పట్టాలు ఇప్పించుట కొరకు, మరియు ఇతర ఆర్దిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో ఆన్లైన్లో నమోదు చేసి, విడతల వారీగా అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ ఓ సురేష్ బాబు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, ఏపీవో పవర్ మునీర్ పాషా, ఏడి అగ్రికల్చర్ భాస్కర్, ఆర్ సి ఓ గురుకులం వెంకటేశ్వరరాజు,మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.