జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ ఎ.డి జయంతి.
డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్లో NPRD అఖిల భారత 3వ మహాసభలను జయప్రదం చేయండి!!
(ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్పిలుపు)
వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వికలాంగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపు నిచ్చారు
దివి: 23-11-2022 బుధవారం రోజున ఎన్పిఆర్డీ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమీకృత భవనంలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయంతి గారితో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభల పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభలు జరపడం అభినందనీయమని అన్నారు. ఈ మహాసభలో వికలాంగుల హక్కులు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. 2016 ఆర్పిడి చట్టంలోని సెక్షన్ 89, 92, 93లను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నేటికీ నేషనల్ ట్రస్ట్ వికలాంగుల ప్రధాన కమిషనర్ కార్యాలయాల్లో చైర్మన్లు లేరని అన్నారు. మానసిక వికలాంగుల చట్టం అమల్లోకి వచ్చి అనేక ఎండ్లు గడుస్తున్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్ల సౌకర్యం కోల్పోతారని అన్నారు. గడిచిన 8 ఎండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు, మహిళా వికలాంగులపై లైంగిక వేదింపులు పెరిగిపోతున్నాయని వాటిని ఎందుకు అరికట్టడం లేదని, కఠినమైన చట్టాలు ఎందుకు తీసుకరావడం లేదని ప్రశ్నించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వికలాంగులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అఖిల భారత మహాసభల్లో దేశ వ్యాపితంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. దేశ వ్యాపితంగా 22 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. దేశ వ్యాప్తంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లు తదితర అవకాశాల సాధనకై ఎన్పిఆర్డీ పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో వికలాంగుల హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలపై సెమినార్స్ చర్చాగోస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 26 నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్ నగరంలో బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27, 28 తేదీల్లో ప్రతినిధులసభ ఉంటుందని అన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు వికలాంగులు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు సభ్యులు మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు బండవరం శ్రీదేవి, కొత్తపల్లి రమేష్, జిల్లా కోశాధికారులు నామాల రాజు, ఇట్టబోయిన మధు, జిల్లా కమిటీ సభ్యులు మోతె వేంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.