
08.12.2022*!****
పెన్షన్10 వేలకు పెంచాలి!!****డిసెంబర్ 26, 27, 28 తేదీలలో జరిగే అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి.!!**—————————–(ఎన్పిఆర్డి జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పిలుపు.)రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వికలాంగులకు వికలాంగుల బందు, వికలాంగుల భీమా పథకాలు, వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంపు, వికలాంగుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ తదితర సమస్యల సాధన కోసం ఎన్పిఆర్డీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుందని, డిసెంబర్ 26, 27, 28 తేదీలలో హైదరాబాద్ నగరంలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభలు నిర్వహించడం జరుగుతున్నదని ఈ మహాసభలకు జనగామ జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో వికలాంగులు పాల్గొని జయప్రదం చేయాలని ఎన్పిఆర్డి జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పిలుపునిచ్చారు. దివి: 08-12-2022 గురువారం రోజున స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్పిఆర్డీ గ్రామ సమావేశానికి సంఘం జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్ లు పాల్గొని మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా వికలాంగులు ఉన్నారని, వీరిలో కేవలం 11వేల 234 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీల కంటే చాలా వెనుకబడిన సామాజిక వర్గం వికలాంగుల వర్గం అని ఎస్సి, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన దళిత బందు, చేనేత భీమా పథకాల మాదిరిగా వికలాంగులకు వికలాంగుల బందు, వికలాంగుల భీమా పథకాలు ప్రకటిస్తే వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి, సాధికారిత సాధ్యం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు వికలాంగులకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వికలాంగులకు వికలాంగుల బందు వికలాంగుల భీమా పథకాలు, పెన్షన్ 10 వేలకు పెంపు, ఉచిత విద్యుత్ పథకాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జీవో నంబర్ 13 ప్రకారం రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేక రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ లలో ర్యాంపులు, సౌకర్యాలు లేకపోవడంతో వికలాంగులు మాధ్యమిక విద్యాకు దూరంగా ఉన్నారన్నారు. వికలాంగుల పిల్లలకు విద్యా ప్రత్యామ్నాయాలపై పాలకులకు చిత్తశుద్ది లేదని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానం వల్ల వికలాంగులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు. అంధత్వం, మానసిక, వినికిడి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అంధత్వం, మానసిక, వినికిడికీ సంబందించిన పరికరాలను అందుబాటులో ఉండేవిధంగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 21రకాల వైకల్యాల వారికి వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6 ఎండ్లు అవుతుందని అమలులో మాత్రం నిర్లక్ష్యం ఉందని, ఈ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల వికలాంగులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 ఆర్పిడి చట్టం చెపుతున్న రాష్ర్టంలో ఆర్టీసీ అధికారులు మాత్రం బదిరులు, మానసిక వికలాంగులు, అంధులకు 100 శాతం వైకల్యం ఉంటేనే రాయితీ బస్ పాస్లు ఇస్తామని అధికారులు చెప్పడం సరైంది కాదన్నారు. షరతులు లేకుండా వికలాంగులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. పేదలపై భారాలు వేస్తు సంపన్నులకు రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు. వికలాంగులను అవమానపరిచే ఘటనలు అనేకం జరుగుతున్నాయని, ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడంలేదని, జీవోలు ఎన్ని వచ్చిన వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు? సమస్యల పరిష్కారసాధన, ఆత్మగౌరం, హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 26న హైదరాబాద్ లోని ఇందిరపార్క్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, 27, 28 తేదీలలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభలలో జరగనున్నావని, ఈ మహాసభలలో వికలాంగుల సమస్యలను, ప్రభుత్వ విధానాలను చర్చించి భవిష్యత్ పోరాటాల ప్రణాళిక రుపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి వికలాంగులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల కుమార్, జిల్లా కోశాధికారి నామాల రాజు, స్టేషన్ ఘనపూర్ మండల కార్యదర్శి ఆకారపు కుమార్, మండల ఉపాధ్యక్షులు రడపాక యాదగిరి, భూమా రజిత, కమల్ల శ్రీనివాస్ లతో పాటు తదితరులు గ్రామ వికలాంగులు పాల్గొన్నారు. అనంతరం ఎన్పిఆర్డీ శివునిపల్లి నూతన గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.**ఎన్పిఆర్డీ శివునిపల్లి నూతన గ్రామ కమిటీ. ** గ్రామ అధ్యక్షులు: పాలకుర్తి విశ్వనాథ్, కార్యదర్శి: కుసుమ విజయ్, ఉపాధ్యక్షురాలు: పొన్నబోయిన రాధ, సహాయ కార్యదర్శి: తోట యాదగిరి, కమిటీ సభ్యులు: కూనూరు ఎల్లా గౌడ్, చాదరబోయిన వెంకటేశం లను ఎన్నుకొని ప్రకటించడం జరిగింది. **ఎన్నికైన నూతన గ్రామ అధ్యక్షులు పాలకుర్తి విశ్వనాథ్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 వారోత్సవాల సందర్బంగా ఎన్పిఆర్డీ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది.**