bhadradri kothagudem news
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
దుమ్ముగూడెం మండలం,
మంగవాయి భడవ గ్రామంకు చెందిన పోడియం సురేష్, సావిత్రి దంపతులు, తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం మరియు కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవారాని, తన రోజువారి కూలీ పనులు మరియు వ్యవసాయం చేసుకోవడానికి పొలం పనులకు వెళ్ళగా అనుకోకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు పూర్తిగా దగ్ధమై కుటుంబం అంతా నిలువ నీడ లేక నిరాశ్రయులైనరని ఆయన అన్నారు. తమ కుటుంబానికి మరియు పిల్లలకు ఇల్లు కట్టుకోవడానికి తన వద్ద ఆర్థిక స్తోమత లేదని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని అర్జీ పెట్టుకోగా, ఐటీడీఏ ట్రైబల్ రిలీఫ్ ఫండ్ నుంచి 25 వేల రూపాయల చెక్కును పోడియం సురేష్ కు అందించి వసతి ఏర్పాటు చేసుకోవాలని పిఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడి అగ్రికల్చర్ భాస్కర్ మరియు పోడియం సురేష్ తదితరులు పాల్గొన్నారు.