వీరనారి సాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో పోరాటాలు నిర్వహించాలని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. ఆదివారం హంటర్ రోడ్డు లోని ఎం.ఆర్ భవన్ లో ఐలమ్మ వర్దంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకార్లపై పోరాడి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఐలమ్మను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ పండించిన ధాన్యం పంటను అక్కడి దొర గూండాలు బలవంతంగా లాక్కోవాలని చూసినప్పుడు ఈ పోరాటం సాయుధ రూపం తీసుకుందని, అయ్యా బాంచన్ నీ కాల్మొక్తా అని దొరల కింద బానిసలుగా బ్రతుకుతున్న తెలంగాణా రైతుల్లో పోరాటం చేయాలనే స్ఫూర్తిని రగిలించారని నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటానికి పిలుపునివ్వడంతో ఐలమ్మ నిజం, నవాబు దేశముఖ్ దొరలకు వ్యతిరేకంగా పోరాడి తరిమికొట్టిన గొప్ప చరిత్ర ఆమెకే దక్కిందని కొనియాడారు. వారి స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నడుస్తున్న గూడిసెల పోరాటాల్లో మనందరం ముందుండలని, వాటిని సాదించుకోవడం కోసం ఐలమ్మ గారిని స్పూర్తిగా తీసుకొని విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దూడపాక రాజేందర్, నోముల కిషోర్, కంచర్ల కుమరస్వామి, సాంబరాజు శ్వేతా, పోట్లపెళ్లి రాజు, పల్లపు చామంతి, శివరాత్రి కర్నకర్, సముద్రాల అనిల్, రాజియా, శ్రీవాణి, పవన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు