వీరానారి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
బంచెందోర కాల్మొక్త అన్న వారితో బందుకులు పట్టించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులలో ఒకరైన చిట్యాల ఐలమ్మ జీవిత స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ,సిపిఎం రాష్ట్ర నాయకురాలు బుగ్గ వీటి సరళ అన్నారు . స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి బుగ్గ వీటి సరళ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ రజాకార్లను ఎదిరించి నిజాం సైన్యాలను తరిమి కొట్టి భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకి విముక్తి కోసం ఆదర్శ పోరాటాన్ని కొనసాగించిన వీరనారి ఐలమ్మ తన భూమిలో పండిన ధాన్యాన్ని పేదలకు సంచి అందరూ సమానంగా ఉండాలని , రజాకార్ల సైన్యాన్ని వంటి చేత్తో వారి దౌర్జన్యాలను వ్యతిరేకించి పోరాట పట్టిమను ప్రదర్శించి ర రజాకార్ల సైన్యాలను వెనక్కు పంపిన వీర చరిత్ర చిట్యాల ఐలమ్మదేనని అన్నారు. భూమికోసం జరిగిన మహత్తర పోరాటంలో అనేక త్యాగాలతో కూడిన మహనీయుల చరిత తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పనికిపుచ్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేటి బిజెపి పాలనలో విర తెలంగాణ సాయుధ పోరాటానికి ముస్లింల హిందువుల మధ్య ఘర్షణ గా సృష్టించి, ఆనాటి మహత్తర పోరాటానికి వక్రీకరించి చెబుతున్న చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అనేక విజయాలు సాధించిన మహనీయుల చరిత్రను అధ్యయనం చేసే వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. నేటి నుంచి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వరోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మందలపు జ్యోతి, కొలగని బ్రహ్మచారి ,జిల్లా కమిటీ సభ్యులు రేపకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, పద్మ, పట్టణ నాయకులు డి వీరన్న, సండకూరి లక్ష్మి, వాంకుడోథ్ అమర్ సింగ్ ,వై వెంకటేశ్వరరావు, రాజారావు, ఎమ్మెస్ ప్రకాష్ , రమేష్ బాబు, అన్నవరపు ఇందిరా, అన్నవరపు పద్మ రమ నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు.