
station ghanpur news
వేలేరులో ప్రధాన రహదారి పక్కనే ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావులు సమస్య పై గతంలో అధికారులను ప్రశ్నించి నిలదీసిన ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ స్పందించిన అధికారులు కాంట్రాక్టరలు గళం న్యూస్ వేలేరు వేలేరు,ధర్మసాగర్ మండలాల్లో రహదారుల ప్రక్కన వ్యవసాయ బావులు అనేకం ఉన్నాయని,నిత్యం వాహనదారులు,ప్రజలు మండల కేంద్రానికి వస్తుంటారని,ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నదని,బావులు వద్ద ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు,సేఫ్టీ వాల్స్ లేవని గత 6నెలల కింద వేలేరు ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.ఏ ఒక్కరి ప్రాణానికి హాని కలిగిన ఆ భౌతికకాయాన్ని తీసుకొని అధికారుల,కాంట్రాక్టర్ల ఇండ్ల ముందు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తానని ఆనాడు హెచ్చరించడం జరిగింది.అయినా అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు అధికారులు ఉండడంతో ఇటివల మరోసారి అధికారులతో మాట్లాడగా వారు స్పందించి రోడ్డు పక్కన ఉన్న బావులకు సేప్టీ వాల్స్ పనులు చేపట్టారని తెలిపారు.ప్రశ్నించి,నిలదీస్తే నే అధికారులు స్పందిస్తారని సద్దాం అన్నారు.ఏదేమైనా స్పందిచిన అధికారులకు కాంట్రాక్టర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సద్దాంహుస్సేన్ తోపాటు వార్డు మెంబర్ బైరి అనిల్,యువ నాయకులు రవి ప్రశాంత్,సలీంమాలిక్,రాజు,మధు.రైతులు తదితరులు పాల్గొన్నారు.