2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సేకరణ ప్రక్రియను శనివారం ఘన్పూర్ స్టేషన్‌లోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో అదనపు జిల్లా కలెక్టర్ బెన్ షాలోమ్ అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మిల్లింగ్ ప్రక్రియ పూర్తిచేసి,ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యమైన బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని బియ్యం మిల్లుల యజమానులను ఆదేశించారు.మిల్లింగ్ సమయంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని,తేమ శాతం,బియ్యం శుద్ధి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.కస్టమ్ మిల్ల్డ్ రైస్ సేకరణలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఘన్పూర్ స్టేషన్ రెవెన్యూ డివిజనల్ అధికారి,మండల తహశీల్దార్,జిల్లా సాంకేతిక అధికారులు,రాష్ట్ర గోదాముల సంస్థ మేనేజర్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు,బియ్యం మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు