
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని నవదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం బిఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు గండ్ర గౌతం రెడ్డి శ్రీ చండేశ్వరి దేవిగా దర్శనం ఇచ్చిన నవ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు గౌతం రెడ్డి కి శాలువా కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోశాలతో విరాజిల్లాలని ఆయన కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ భక్త కమిటీ గౌరవ అధ్యక్షుడు రఘుసాల తిరుపతి, అద్యక్షుడు కరట్లపల్లి రాజేందర్, భట్టు శ్రీనివాస్, నిమ్మల రాజు,కట్ల ప్రకాష్, గోనె రామ్ రెడ్డి,సుకిన సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.