
ఆర్య
విషయము: పీఏ పల్లి మండల కేంద్రంలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన నిందితుని కఠినంగా శిక్షించుట గురించి
5వ తేదీన దరఖాస్తు ఇచ్చినప్పటికీ గుదిపల్లిఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసు నమోదు చేయకపోవడం బాధితులకు న్యాయం చేయకపోవడం వల్ల ఎస్సై పైన చర్యలు తీసుకొనుట గురించి
పై విషయాలుసారము తమరికి తెలియజేయునది ఏమనగా పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన ST (ఎరుకల)కులానికి చెందిన 16 సంవత్సరాల విద్యార్థిని స్కూలుకు వెళుతుండగా నారాయణదాసు రవితేజ బీసీ (చాకలి) బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని అత్యాచారం జరిపి బాధితులను బెదిరించినాడు. ఇట్టి విషయమై బాధితులు గుడిపాల్లి ఎస్సై గారికి తేదీ 5/ 4 /23 న బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది.కనీసం ప్రాథమిక విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిందితుల పక్షాన మాట్లాడి జాప్యం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఫోక్సో చట్టం డి.ఎస్.పి పరిధిలో ఉన్నప్పటికీ కనీసం డిఎస్పి కి కూడా గుడిపల్లి si తెలియజేయకపోవడం డిఎస్పీ గారు నా దృష్టికి రాలేదు అనడం పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు 8/ 4 /23 న నల్లగొండ జిల్లా కేంద్రానికి బాధితులు తమరి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. తమరు సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని మైనర్ బాలిక విషయంలో నిర్లక్ష్యం వహించిన ఎస్సై పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను.