
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని శ్రీ రామాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ రామనవమి కళ్యాణ మహోత్సవంలో భక్తజనసందోహం పాల్గొంది.మండే ఎండల మధ్య భక్తులు ఎన్నో కష్టాలకూ భయపడకుండా,భగవద్భక్తితో కళ్యాణ వేడుకల్లో పాల్గొనగా,ఆర్యవైశ్య సంఘం వారు తమ నిస్వార్థ సేవా భావంతో ముందుకు వచ్చారు.భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చల్లని మజ్జిగ మరియు తీపి బెల్లం పానకాన్ని వితరించడంలో ఆర్యవైశ్యులు తన విలక్షణ సేవా భావాన్ని చాటారు.ఈ కార్యక్రమాన్ని అంచూరి యుగంధర్,దాంశెట్టి సోమన్న,ఇమ్మడి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వారు మాట్లాడుతూ..ఎండల తాపాన్ని భరిస్తూ శ్రీరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులకు తాగునీరు,చల్లని పానకం అవసరమని భావించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టాం అని పేర్కొన్నారు.ఈ మహత్కార్యంలో గందె సోమన్న,శ్రవణ్ కుమార్,సంతోష్,సుధీర్,రాజ్ కుమార్,అనిల్ కుమార్,శ్రీనివాస్,రామయ్య, రమేష్,సతీష్,సురేష్ తదితరులు పాల్గొని తమ సేవను అందించారు.భక్తులు ఈ కార్యక్రమాన్ని ఎంతో హర్షాతిరేకాలతో స్వాగతించారు.శ్రీరాముని ఆశీస్సులతో ఇలా మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ,ఈ సేవా కార్యక్రమం ప్రజల హృదయాలను గెలుచుకుంది.