జూలై 03- కోదాడసమాజశాంతికి, ఆధ్యాత్మిక మార్గం అనుసరణీయమది అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్, కొమరబండ వై జంక్షన్ వద్ద గల షిరిడి సాయిబాబా మందిరలలో జరిగిన గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సాయిబాబా ఆశీస్సులతోప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సమాజ శ్రేయస్సుకై ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి సేవా సమితి వారిని ఈ సందర్భంగా అభినందించారు. సాయిబాబా దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.