
సమాజ సేవకులు వినియోగదారుల సంఘాల్లో చేరాలి
సమాజ సేవ చేయాలనుకొనే వారు వినియోగదారుల సంఘాల్లో చేరాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా పల్లెపాడు దామోదర్ అన్నారు ఈ రోజు హైదరాబాద్లోని రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం హాలులో జరిగిన VCA & PCA వినియోగదారుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. CCI జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్య, CCI జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి లు గౌరవ అతిథులుగా పాల్గొన్న సదస్సు లో దామోదర్ మా ట్లాడుతూ, వినియోగదారుల సంఘాలు వినియో గదారుల రక్షణ చట్టం 2019 పరిధిలో హ క్కులపై చైతన్యం, హక్కుల పరిరక్షణ కు కృషి చేస్తు న్నాయ ని, ఆ విధంగానే ప్రజా శ్రేయస్సును కోరే వ్యక్తులు, సంస్థలు వినియోగదారుల సంఘాల్లో చేరినప్పు డు ఎటువంటి ఆర్థిక మోసాలకు ఆస్కారం ఉం డదని దామోదర్ తెలిపారు. CCI వర్కింగ్ ప్రెసిడెం ట్ ప్రీతి పాండ్య మాట్లాడుతూ, మహిళలు విని యోగదారులు గా కుటుంబంలో సమాజంలో ము ఖ్య పాత్ర వహిస్తు న్నందున, వారితో వినియోగ దారుల సంఘాల ఏర్పా టు తప్పనిసరి అని అన్నా రు. మహిళలకు వినియోగ దారుల హక్కుల పట్ల శిక్షణా శిబిరాలు నిర్వహించను న్నట్లు తెలిపారు. వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు, CCI జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరా జు చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో 33 జిల్లా లలో ఆహార కల్తీ పట్ల సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల సర్వే అనంతరం, ఆహార కల్తీ పరిశోధన మరియు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. CATCO నూతన అధ్యక్షుడు శంకర్ లాల్ చౌరాసియా వినియోగ దారుల హక్కుల పట్ల వివరించారు. హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ మరియు AICWC ఉపా ధ్యక్షుడు అయిన యం. భీం రెడ్డి వినియోగదారుల చైతన్యం సమాజం లో ప్రముఖ పాత్ర వహిస్తు న్నదని, కాబట్టి గ్రామ గ్రామా న వినియోగదారుల సంఘాల ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల కో- కన్వీనర్ డా. హరిప్రియ ప్రత్యేకంగా వినియోగదారుల మహిళా సంఘా లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంత రం VCA & PCA పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.