రైస్ మిల్ అసోసియేషన్ నాయకుల ఆద్వర్యంలో ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రైస్ మిల్ అసోసియేషన్ నాయకుల ఆద్వర్యంలో ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
మండలంలోని భాగిర్తిపేట గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న నూతన సర్పంచ్ పెరుమండ్ల శ్రీలత తిరుపతి గౌడ్ దంపతులను మాజీ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రస్తుత గౌరవ అధ్యక్షులు కోరే రమేష్, అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నల్లబెల్లి అభినవ్ రావు గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో వారు అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులోనూ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రస్తుత జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమండ్ల తిరుపతి గౌడ్ మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును అసోసియేషన్ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో అసోసియేషన్ సెక్రటరీ యాంసాని సంతోష్, క్యాషియర్ కాసిడి రవీందర్ రెడ్డి, రైస్ మిల్లర్లు ఎండి. రహిమొద్దీన్, దడిగెల దేవేందర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.