
ఈ69న్యూస్ గుడివాడ
పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం
కమ్యూనిటీ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం కొర్నిపాడు గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సభ్యులు పెదపారుపూడి,బేతేలు,గుడివాడ లోని వృద్దులకు,పేదవారికి అన్నదానం చేశారు.ఈ సందర్భంగా హ్యుమానిటీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇంచార్జీ షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..సర్వ మానవులు అల్లాహ్ కుటుంబమే అనే ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ బోధనలను ఆదర్శంగా తీసుకొని ఈ శాఖ ప్రపంచమంతటా మానవాళికి ఎక్కడ విపత్తులు సంభవించిన గాని తమ వంతు సహాయాన్ని చేస్తున్నదన్నారు.అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు కలియుగ అవతార పురుషుడు మీర్జా గులామ్ అహ్మద్ భారతదేశంలోని ఖాదియాన్ గ్రామంలో 1889వ సంవత్సరంలో కమ్యూనిటీని స్థాపించడం జరిగిందని నేడు విశ్వవ్యాప్తంగా కమ్యూనిటీ యొక్క ఐదవ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో 200 లకు పైగా దేశాల్లో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుందని అన్నారు.అందరిని ప్రేమించు ఎవరిని ద్వేషించకు”అనే నినాదంతో మానవ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన కొర్నిపాడు అహ్మదీయ ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ ఉస్మాన్.కొర్నిపాడు గ్రామం ముస్లిం ప్రెసిడెంట్ నాగూర్ సాహెబ్.గ్రామ యువకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.