
telugu galam news e69news local news daily news today news
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి
భద్రాచలo పట్టణంలో జరిగిన హమాలీ జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక ,కర్షక ,వ్యవసాయ కార్మికుల ,యొక్క హక్కులను కాల రాస్తున్నందున ప్రభుత్వ పరిశ్రమలన్నీ ప్రైవేటేకరిస్తున్నందుకు హామాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయని కారణంగా అనేకమంది కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని వారికి ఎటువంటి ఉపాధి దొరికే పరిస్థితులు కనబడటం లేదని బిజెపి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని దానికి సమానంగా పేదల కష్టాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని కనీస వేతనాలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మరలా ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం గానీ గెలిస్తే ప్రజల మధ్య వ్యత్యాసాలు ఏర్పడతాయని కావున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి దించాలి అంటే ఈ నెల 16 తేదీ జరుగుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక గ్రామీణ బంధును జయప్రదం చేయాలని దానికి భద్రాచల పట్టణంలోని ప్రజలందరూ వ్యాపారులు ,రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, అందరూ సహకరించాలని ఆ రోజు జరిగే గ్రామీణ బంద్ ని జయప్రదం చేయాలని నిరసనగా జరిగే ర్యాలీని కూడా జయప్రదం చేయాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు సాయి, శ్రీను ,సత్యం, నాగయ్య, వెంకట్రావు, నరసింహారావు,గోపి అనేకమంది హమాలీ కార్మికులు పాల్గొన్నారు