
ap news
పట్నం రాజేశ్వరి
చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ ల జయంతులను ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఏమ్మిగానురు పట్టణం నందు గల స్థానిక ఉర్దూ పాఠశాల లో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాయలసీమ అధ్యక్షురాలు భారతమ్మ ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ ల జయంతి వారోత్సవాల సభలో ముఖ్య అతిథులుగా పట్నం రాజేశ్వరి, నంది విజయలక్ష్మి,మల్లెల అల్ఫ్రెడ్ రాజు, స్కూల్ ప్రధాన ఉపాద్యాయులు కోటప్ప,ఖదీర్,pdsu రవి కుమార్ ,dyfi అజిత్,IFT హనీఫ్ ,బిసి సంఘం నాయకులు రామచంద్ర లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్నం.రాజేశ్వరి మాట్లాడుతూ దేశంలో నేడు మహిళలు అన్ని రంగాల్లో ప్రవేశించి అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నామంటే అందుకు కారణం చదువు. ఆ చదువును మనకు అందించిన తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ లే అన్న విషయం మర్చిపోవద్దని, వారికి మనం రుణపడి ఉన్నామని ఆమె అన్నారు. మతఛాందసవాదుల దాడులను ఎదుర్కొని మహిళల విద్య కోసం, వితంతు పునర్వివాహాల కోసం నిరంతరం తపిస్తూ, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ మహిళల చదువు కోసం మహిళల ఆత్మగౌరవం హక్కుల కోసం నిరంతరం శ్రమించి తమ జీవితాలనే పణంగా పెట్టి పోరాడిన చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ ల విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో మరియు పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక టీమ్ సభ్యులు హుస్సేన్ బీ, ఖాసింబీ, దస్తగిరమ్మ,ఈరమ్మ,రేవతి,ఎర్రకోట లక్ష్మీ,రంగమ్మ,మరియమ్మ,అమీనా బి,ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.