
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈరోజు బుధవారం భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో సింగరేణి వర్క్ పీపుల్ మరియు గేమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ లెవెల్ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అదేవిధంగా,ప్రతీ సింగరేణి ఉద్యోగి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత సాధించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు.సింగరేణి ఉద్యోగులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారని ఎమ్మెల్యే సూచించారు.మన భూపాలపల్లి నుండి రాష్ట్ర,జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ కేటగిరిలల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి,జిల్లా అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి,అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్,భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తదితరులు ఉన్నారు.