సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
సిగాచి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి*
*తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి*
*యాజమానులకు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదు*
*ప్రభుత్వ ఉదాసీనత, యాజమాన్య నిర్లక్ష వైఖరీతోనే ప్రమాదం*
*సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు*
*జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా.. సూపరిండెంట్ కు వినతి పత్రం*
పాశమైలారం ప్రాంతంలోని
సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలనీ, తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు, 50 లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ సూపరిండెంట్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని ఇప్పటివరకు అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు.. గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. చికిత్స పొందుతూన్న కార్మికుల్లో కూడా ఇంకా అనేకమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు, కార్మికుల మృత్యువాతలు పడుతున్న ప్రభుత్వ అధికారులు కానీ, పరిశ్రమల యజమాన్యాలు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.
కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. లాభార్జనే ధ్యేయంగా వీళ్ల తీరు ఉందన్నారు. అన్స్కిల్డ్ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పని చేయించడం సరైంది కాదన్నారు. అన్స్కిల్డ్ వర్కర్లతో పని చేయించడం వల్లనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఘటన జరిగిన నాటి నుండి సీపీఎం బాధితుల పక్షాన నిలుస్తుందన్నారు. ఈరోజు 11 కుటుంబాలకు 5 వేల చొప్పున విరాళాలు అందజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, విద్యాసాగర్, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, బాగారెడ్డి, నాగభూషణం, బాలరాజు, విఠల్, లక్ష్మారెడ్డి, తది తరులు పాల్గొన్నారు.