
సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి డిమాండ్
జనగామ జిల్లాలో ఎండిన పంటలకి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలి….
జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలి…
సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి డిమాండ్
………………………………………..
జనగామ: జనగామ జిల్లాలో ఎండిన వరి మరియు ఇతర పంటలకు నష్టపరిహారం ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని 16న ఘన్పూర్ కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోరారు.
శనివారం రోజున జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడంతో రైతుల పంటలు దారుణంగా ఎండిపోయినాయని అన్నారు.
యాసింగిలో నీటి వనరులు ఆధారంగానే రైతులు తక్కువ ఎకరాల్లో పంటలు వేయడం జరిగింది. వేసిన కొద్దిపాటి పంటలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువులు కుంటలు నింపకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయినాయని అన్నారు. వర్షాకాలంలో అంతంత మాత్రంగానే రైతులు పంటలు పండించడం జరిగిందన్నారు. యాసంగిలోనైనా పంట పండుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది రైతులందరికీ బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం రైతు భరోసా మొత్తం రైతులకు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం నీటిపారుదల శాఖ అధికారులు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దేవాదుల కాలువల ద్వారా రిజర్వాయర్లు చెరువులు కుంటలలో నీళ్లను నింపితే ఇలాంటి దారుణ పరిస్థితిలో ఉండేవి కావని అధికారుల పాలకుల నిర్లక్ష్యమే జిల్లాలో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని వివరించారు.
కావున ప్రభుత్వం స్పందించి జిల్లాలో పూర్తిస్థాయిలో ఎండిన పంటలను ఎనమరేషన్ చేయించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని
డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు E అహల్య బోట్ల శేఖర్ బూడిద గోపి ఎండి అజారుద్దీన్ నాయకులు బాల్నే వెంకటమల్లయ్య కుర్ర ఉప్పలయ్య దారావత్ మహేందర్
అజ్మీర సురేష్ నాయక్ కన్నెబోయిన బాలరాజ్ మంగ బీరయ్య బొట్ల శ్రావణ్ పాము శ్రీకాంత్ మణిరత్నం బండ సౌందర్య మల్లేష్ రాజా సుధాకర్ కర్రే రాములు కర్రే సత్తయ్య కిష్టయ్య ఓధ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.