
సందర్శించిన సీపీఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
హన్మకొండ, సీపీఎం ఆధ్వర్యంలో వేసిన గుడిసెలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. హన్మకొండ హంటర్ రోడ్డు లో 964 సేర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గత 4 నెలల సీపీఎం ఇల్లులేని నిరుపేదలకు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మూడు గుడిసెలు అంటుకోవడం తో చుట్టూ పక్కల ఉన్న గుడిసేవాసులు సకాలంలో స్పందించి ఆర్పేయడం తో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై సీపీఎం హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ సందర్శించి, మాట్లాడుతూ రాత్రి ఘటనలో గుడిసెల్లో చంటి పిల్లలతో నిద్రిస్తున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా బ్రయబ్రాంతులకు గురయ్యారన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను పలువురు ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేస్తుండగా మరోవైపు నిరాశ్రయులైన నిరుపేదలు తమకు ప్రభుత్వం ఆవాసం కల్పించి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని గత కొంతకాలంగా వివిధ సీపీఎం ప్రజలు పోరాడుతున్నా ఈ ప్రభుత్వలు పట్టిచుకోవడం వల్లే నిలువ నిడలేని పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని కాల్చివేసేందుకు కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ భూమి నుంచి తమను వెళ్ళగొట్టే పనిలో భాగంగానే ఇదంతా జరిగిందని, మమ్మల్ని భయపెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన భయపడేది లేదన్నారు. అలాగే ఈ భూమి ని విడిచివెళ్లే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సౌత్ మండల కమిటీ సభ్యులు అలకుంట్ల యకయ్య, కంచర్ల కుమరస్వామి, దూడపాక రాజేందర్, నోముల కిషోర్, అలకుంట్ల మల్లయ్య, భారతి, రాజక్క తదితరులు పాల్గొన్నారు.