
సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహమే
1948 సెప్టెంబర్ 17 నా తెలంగాణకు జరిగింది విద్రోహమే అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో ఇల్లందు డిగ్రీ కళాశాలలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం PDSU జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ మాట్లాడుతూ…….
1947నా దేశంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ తెలంగాణ మాత్రం నిజాం నవాబు పరిపాలనలోనే ఉందని, నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశ్ ముఖ్, దొరల, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం తిరగబడి వేల ఎకరాల భూములను పేద ప్రజలు స్వాధీనం చేసుకున్నారని ఈ క్రమంలో సంస్థానాల విలీనం పేరుతో యూనియన్ సైన్యాలు తెలంగాణలోకి ప్రవేశించగా, ఇటు రైతుల తిరుగుబాటు ఆటు యూనియన్ సైన్యాల మోహరింపులు తట్టుకోలేని నిజాం నవాబు యూనియన్ సైన్యాలకు లొంగిపోయాడని ఎంతోమంది తెలంగాణ రైతులను ఊచకోసిన సైన్యాధ్యక్షుడు కాసిం రాజ్వీ కూడ లొంగిపోగ ఈ ఇద్దరిని నాటి దేశపాలకులు ఎంత గౌరవప్రదంగా దేశం దాటించారని సంస్థానాల విలీన కోసం వచ్చిన యూనియన్ సైన్యాలు వెన్నుదురుగాకుండా రైతాంగ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తూ రైతులపై దాడులను తీవ్రరతం చేసిందని దొరలకు, భూస్వాములకు అండగా ఉంటూ ప్రజలు సాధిమచుకున్నా భూములను తిరిగి దొరలకు అందేలా చేశాయని స్వేచ్ఛ, స్వతంత్ర పరిపాలన దిశగా పోవాల్సినా తెలంగాణ యూనియన్ సైన్యాలతో అతలాకుతల వైందని కావున సెప్టెంబర్ 17 తెలంగాణకు ముమ్మాడిగా విద్రోహ దినమేనని నాటి నిజాం నవాబు పరిపాలనను రాష్ట్రంలో పాలకులు కొనసాగిస్తుంటే హిందూ, ముస్లింల పోరాటంగా కేంద్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాల పేరుతో చరిత్రను వక్రీకరించే ఈ చర్యలను తిప్పికొడుతూ సెప్టెంబర్ 17న విద్రోహ దినంగానే పాటించాలని వారు తెలిపారు.
ఈ సదస్సుకు PDSU జిల్లా కోశాధికారి జె గణేష్ అధ్యక్షత వహించగా నాయకులు శివ, రాజు, కౌశిక్, సిద్దు, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.