
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం :
సేవకు చిరునామా అతడు.గిరి బిడ్డల ప్రగతికి నిత్య కృషివలుడు. ఏజెన్సీ నుంచి ఎందరో బాలికలను ఉన్నత శిఖరాల వైపు మళ్ళించాడు. విద్య, క్రీడలు, సాంస్కృతికంగా గిరి బిడ్డలు జైత్రయాత్రకు కీలకంగా వ్యవహరించాడు. సేవకు చిరునామా అయిన ఎం.దేవదాసును ప్రభుత్వం గుర్తించింది. ఉత్తమ ప్రిన్సిపాల్ గా గౌరవించింది. ఇందుకు సంబంధించిన వివరాలు....
భద్రాచలం గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ గా ఎం. దేవదాసు పనిచేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి పైగా గిరిజన బాలికలు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ నిత్య సేవలందించటమే కర్తవ్యంగా ప్రిన్సిపాల్ దేవదాసు పనిచేస్తున్నారు.
ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఎంతోమంది గిరిజన బాలికలు జేఈఈ మెయిన్స్, నీట్ తదితర పరీక్షల్లో రాణించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఎంతోమంది విద్యార్థినిలు క్రీడల్లో దేశస్థాయిలోనే రాణించారు. సాంస్కృతిక పరంగా కూడా ఎన్నో అవార్డులు ఈ కళాశాలకు, పాఠశాలకే దక్కాయి.
పరిక్ష ఫలితాల్లో ఎప్పుడు అగ్రస్థానం ఈ విద్యాసంస్థదే. భద్రాచలం గిరిజన గురుకులంలో చదివిన గిరిజన బాలికలు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం చేసుకుంటున్నారు. అందుకేనేమో కాబోలు, ఈ కళాశాల పనితీరును గ్రహించిన భద్రాచలం ఐటిడిఏ అధికారులు ప్రిన్సిపాల్ ఎం దేవదాసును ఎన్నోసార్లు అభినందించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కళాశాలకు వచ్చి...ఇక్కడ నిర్వహిస్తున్న తరగతులు, ఇతరత్రా అంశాలు పరిశీలించి వారి రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటుకు గతంలో పరిశీలించటం జరిగింది అంటే ఈ విద్యాసంస్థ నాణ్యతను అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల వేదికకు కూడా ఇదే గురుకులాన్ని ఉన్నతాధికారుల ఎప్పుడు ఎంచుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇగ్నైట్ ఫెస్ట్ కూడా ఇదే కళాశాలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అంకిత భావంతో పనిచేసే ప్రిన్సిపాల్ ఎం దేవదాసు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సేవలను పలుమార్లు రాష్ట్ర అధికారులు కూడా ప్రశంసించడం జరిగింది
ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డుకు దేవదాస్ ఎంపిక
గిరి బిడ్డల ఉన్నత లక్ష్యంగా పనిచేస్తున్న భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎం. దేవదాసు సేవలను ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం కొత్తగూడెం కలెక్టరేట్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అలా గారి చేతుల మీదుగా ఎం దేవదాసు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు, ప్రశంసా పత్రం స్వీకరించారు.సేవకు తగిన గుర్తింపు లభించిందని పలువురు ప్రిన్సిపాల్ ఎం దేవదాసుని సందర్భంగా ఈ అభినందించారు