
2023-24 సం”నికి గాను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2,90,396 కోట్లలో రజక,నాయి బ్రాహ్మణ వృత్తి దారులకు కేవలం 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని ప్రకటన మాత్రమే చేశారు.
✓గతంలో రజక వృత్తిదారుల ఫెడరేషన్ కి రూ:250 కోట్ల బడ్జెట్ ప్రకటించిన ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 59 కోట్ల 70 లక్షలు ప్రకటించి రజకుల పట్ల తీవ్ర వివక్ష చూపించింది అని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
✓మోడ్రన్ దోబీఘట్లుకు, సొసైటీ రుణాలకు ,ప్రమాద బీమా పథకం,వృత్తిశిక్షణకు నిధులు ప్రస్తావన లేకపోవడాన్ని తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటి తీవ్రఆవేదన వ్యక్తం చేసింది
✓గతంలో ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.1000కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్ కి కేవలం 300 కోట్లు నామమాత్ర నిధులు ప్రకటించింది.
✓నాయి బ్రాహ్మణులకి కేవలం 50 కోట్లు మాత్రమే కేటాయించారు.
✓యాట పదివేల కోట్లు బీసీల సంక్షేమానికి నిధులు ఇస్తామని తెలిపిన ప్రభుత్వం కేవలం ఈ సంవత్సరం రూ:6,229కోట్లు మాత్రమే కేటాయించారు.
✓బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కనీసం 25శాతం బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.