
telugu galam news e69news local news daily news today news
మహారాష్ట్ర వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసిన అహ్మదీయ మహిళలు
గళం న్యూస్ ఖమ్మం
ఖమ్మం జిల్లా కెప్టెన్ బంజారా గ్రామ అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వలస వచ్చిన నిరుపేద 10 కుటుంబాల కూలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానిక మౌల్వీ ముస్తఫా మాట్లాడుతూ…ఇస్లాం ధర్మం మానవత్వానికి పెద్దపీట వేసిందన్నారు.మానవ సేవే లక్ష్యంగా అహ్మదీయ ముస్లిం జమాత్ యావత్ ప్రపంచంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జమాత్ అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా,మౌల్వీ
షేక్ ముస్తఫా,మహిళా విభాగం గ్రామ శాఖ అధ్యక్షురాలు షేక్ బి జాన్ బి,ప్రధాన కార్యదర్శి ఆసియా పర్వీన్,బోర్డు ఉపాధ్యక్షురాలు షేక్ సుల్తానా బేగం.యూత్ అధ్యక్షుడు షేక్ సయ్యద్ జాన్,హబ్తా అల్ జమీల్,సఫియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.